Comrade Kalyan | 21 రోజుల్లోనే ఓటీటీలోకి ‘కామ్రేడ్ కళ్యాణ్’.. ఎలాంటి ప్రకటన లేకుండా స్ట్రీమింగ్ ప్రారంభం!
Comrade Kalyan | టాలీవుడ్ నటుడు శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన మూడు వారాల్లోనే డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్టోబర్ 9న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి ఆదరణతో పాటు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది.
Comrade Kalyan | టాలీవుడ్ నటుడు శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన మూడు వారాల్లోనే డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్టోబర్ 9న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి ఆదరణతో పాటు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అక్టోబర్ 30 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రావడం విశేషం.శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా నటించిన ఈ చిత్రానికి జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించారు. కోన వెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించారు. రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ వినోదం పంచేందుకు సిద్ధమైంది.
సాధారణంగా సినిమాలు థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి రావడం ఇటీవల సాధారణంగా మారింది. కానీ ‘కామ్రేడ్ కళ్యాణ్’ మాత్రం కేవలం 21 రోజుల్లోనే డిజిటల్ వేదికపైకి వచ్చేసింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే వీక్షించవచ్చు. ‘కామ్రేడ్ కళ్యాణ్’ కథేంటనేది చూస్తే.. ఈ సినిమా కథ 1990వ దశకంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో సాగుతుంది. పెద్దగా చదువుకోని తాడికొండ కళ్యాణ్ (శ్రీవిష్ణు) ఓ గ్రామంలో థియేటర్‌ను లీజుకు తీసుకుని నడుపుతుంటాడు. మరోవైపు అడవుల్లోని నక్సలైట్ దళాలను అణచివేసేందుకు ఐపీఎస్ అధికారి జార్జ్‌కుట్టి (షైన్ టామ్ చాకో) ప్రత్యేకంగా నియమితుడవుతాడు. దీంతో మాస్టర్ (సాయిచంద్) నేతృత్వంలోని దళానికి, పోలీసులకు మధ్య పోరు కొనసాగుతుంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో సితార (మహిమా నంబియార్) అనే ఒడియా యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఆ గ్రామానికి వస్తుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమె తల్లి సరస్వతమ్మను (రాధికా శరత్‌కుమార్) కాపాడిన సితారను చూసి కళ్యాణ్ ప్రేమలో పడతాడు. ఆమెతో కలిసి జీవితాన్ని గడపాలని ఆశపడతాడు. అయితే సితార కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న కళ్యాణ్.. వారిని ఆ కష్టాల నుంచి బయటపడేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో తన స్నేహితుడు దుబాయ్ బాబు (సత్య) సహాయంతో ఓ మార్గాన్ని ఎంచుకుంటాడు. కానీ ఆ నిర్ణయం అతడి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. సాధారణంగా థియేటర్ నడుపుకునే కళ్యాణ్ కాస్తా పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారి ‘కామ్రేడ్ కళ్యాణ్’గా ఎలా మారాడు? నక్సలైట్ దళాలకు అతడికి ఉన్న సంబంధం ఏమిటి? అతడి జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలేంటి? అనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan | 21 రోజుల్లోనే ఓటీటీలోకి ‘కామ్రేడ్ కళ్యాణ్’.. ఎలాంటి ప్రకటన లేకుండా స్ట్రీమింగ్ ప్రారంభం!
Prasidh Krishna: కివీస్‌తో వన్డేలకు ప్రసిద్ధ కృష్ణ దూరం.. ఇండియా-ఏ జట్టులోకి సిరాజ్
Mirzapur: The Movie | ఓటీటీలోకి వచ్చేసిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ షురూ!
Delhi Traders: 12వేల కోట్ల వ్యాపారంపై ప్రభావం.. ర్యాలీని వాయిదా వేయండి.. సోనియా గాంధీని కోరిన ఢిల్లీ వ్యాపారులు
Vijay | సీఎం విజయ్ మానవత్వం.. సైగలతో ఉద్యోగం అడిగిన దివ్యాంగుడికి 24 గంటల్లోనే నియామక పత్రం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

