Delhi Traders: 12వేల కోట్ల వ్యాపారంపై ప్రభావం.. ర్యాలీని వాయిదా వేయండి.. సోనియా గాంధీని కోరిన ఢిల్లీ వ్యాపారులు
Delhi Traders: నవంబర్ ఒకటో తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగే ర్యాలీని వాయిదా వేయాలని ఢిల్లీ వ్యాపారులు ఇవాళ కాంగ్రెస్ నేత సోనియా గాంధీని వేడుకున్నారు. దీపావళి సీజన్ షాపింగ్ జరుగుతోంది కాబట్టి , ర్యాలీ వల్ల సుమారు 12వేల కోట్ల వ్యాపారంపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.
న్యూఢిల్లీ: నవంబర్ ఒకటో తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ ఎత్తును కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించనున్నది. ఆ ర్యాలీలో సుమారు 10 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. అయితే ఆ ర్యాలీని వాయిదా వేయాలని ఢిల్లీ వ్యాపారులు(Delhi Traders) ఇవాళ కాంగ్రెస్ నేత సోనియా గాంధీని వేడుకున్నారు. దీపావళి సీజన్ షాపింగ్ జరుగుతోంది కాబట్టి , ర్యాలీ వల్ల సుమారు 12వేల కోట్ల వ్యాపారంపై ప్రభావం పడే అవకాశం ఉందని, అందుకే ఆ ప్రతిపాదిత ర్యాలీని వాయిదా వేసుకోవాలని సోనియాను ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కోరింది.
ఢిల్లీలో ఆందోళనలు చేయడం వల్ల సుమారు 20 కీలక మార్కెట్లకు నష్టం జరిగే ఛాన్సు ఉన్నట్లు వాణిజ్య సంఘాలు తెలిపాయి. నవంబర్ 11 తర్వాత ర్యాలీ నిర్వహించుకోవాలని, లేదంటే బురారీ గ్రౌండ్‌కు మార్చుకోవాలని వ్యాపారులు కోరారు. రామ్‌లీలా మైదానంలో ర్యాలీ వల్ల పార్కింగ్ సమస్యలు వస్తాయని, దీంతో సుమారు 20 లక్షల మంది వ్యాపారులపై వత్తిడి ఉంటుందని సీటీఐ తన అభ్యర్థనలో పేర్కొన్నది.
రామ్‌లీలా మైదానంలో 20 వేల వాహనాలను పార్క్ చేసేంత సామర్థ్యం లేదని, కనీసం 200 పెద్ద బస్సులను ఆక్కడ ఆపలేమని వ్యాపారులు తెలిపారు. మైదానానికి 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో సుమారు 20 అతిపెద్ద మార్కెట్లు ఉన్నాయని, పండుగ సీజన్ వేళ ఆ మార్కెట్లలో జరిగే సుమారు 12వేల కోట్ల వ్యాపారం దెబ్బతినే అవకాశం ఉన్నట్లు వ్యాపారులు చెప్పారు.
Delhi | Chamber of Trade and Industry (CTI) has written a letter to the Chairperson of the Congress Parliamentary Party, Sonia Gandhi, requesting that the INDIA bloc’s November 1 rally be rescheduled to a date after Diwali, specifically after November 10–11.
CTI Chairman Brijesh Goyal stated, “If 1 million people and 15,000 to 20,000 vehicles enter Central Delhi on November 1st, the daily business turnover of Rs 10,000–12,000 crore across 20 historic markets will come to a complete standstill.”
— ANI (@ANI) October 30, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Traders: 12వేల కోట్ల వ్యాపారంపై ప్రభావం.. ర్యాలీని వాయిదా వేయండి.. సోనియా గాంధీని కోరిన ఢిల్లీ వ్యాపారులు
Vijay | సీఎం విజయ్ మానవత్వం.. సైగలతో ఉద్యోగం అడిగిన దివ్యాంగుడికి 24 గంటల్లోనే నియామక పత్రం!
Nayanthara | ‘మూక్కుత్తి అమ్మన్-2’ నా హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా.. నయనతార ఎమోషనల్ పోస్ట్ వైరల్
Mahatma Gandhi Grandson: అమెరికాలో 30 ఎకరాల భూమిపై వివాదం.. కేసు నెగ్గిన మహాత్మా గాంధీ మనవడి ట్రస్టు
Health tips | అరటిపండుతో అన్నీ లాభాలే.. అవేంటో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

