పాట్నా: కాంగ్రెస్ మద్దతున్న స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోని 70-80 శాతం మంది రాజకీయ నాయకులు పోర్న్ చూస్తారని తెలిపారు. కావాలంటే తనతో పాటు రాజకీయ నాయకులందరి ఫోన్లను ఈ విషయమై తనిఖీ చేయాలని బుధవారం ఆయన డిమాండ్ చేశారు. ‘90 శాతం మహిళలు పురుష నాయకుల గదుల్లోకి వెళ్లకుండా రాజకీయాల్లోకి ప్రవేశించలేరు’ అని మంగళవారం ఆయన చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లపై మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
ఈ వాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీహార్ మహిళా కమిషన్ ఆయనకు నోటీస్ జారీ చేసింది. ‘మహిళల్ని వేధించకుండా వారు రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు పురుష రాజకీయ నాయకులు ఒప్పుకోరు. నేను చెప్పింది తప్పా? నేను మహిళల హక్కుల కోసం పోరాడుతుంటే వాళ్లు వాళ్లని వేధిస్తున్నారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా 755 మంది పురుష రాజకీయ నాయకులపై లైంగిక వేధింపుల ఆరోపణలున్నాయని.. అందులో 155 మందిపై చార్జ్‌షీట్ దాఖలైందని ఆయన అన్నారు.