మన దేహంలో అధిక పరిమాణంలో ఉండేది నీరే! అందులో కొంచెం తగ్గినా సమస్యే. దాన్ని అర్థం చేసుకోకపోతే దాహం తీర్చుకోరు. దేహం సమస్యపోదు. అప్పుడప్పుడూ నీళ్లు తాగితే సరిపోతుందనుకుంటారు. కానీ, వాతావరణ పరిస్థితులు, పని ప్రదేశాల్లో దాహం వేయకపోవచ్చు. అయినా, శరీర అవసరాలు గుర్తించాలి. ఈ లక్షణాలుంటే తనకు దాహం అవుతోందని మన శరీరవాణి చెబుతున్నట్టుగా గుర్తించండి.
ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏదో అయిపోయిందని భయపడకుండా.. అరగంటకోసారి నీళ్లు తాగండి. రోజులో ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తాగితే అన్ని ఇబ్బందులూ తొలగిపోతాయి.