ధ్యానం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేదని తెలిసినా… ఉరుకులు పరుగుల జీవితంలో దాని కోసం ఓ అరగంట సమయాన్ని కేటాయించలేకపోతున్నామని చాలామంది బాధపడుతుంటారు. మెడిటేషన్ పట్ల, దాని ద్వారా ఒనగూరే లాభాల పట్లా అవగాహన ఉన్నా, తీరిక లేకపోవడం వల్ల వాటిని అందిపుచ్చుకోలేక పోతుంటారు. అలాంటి వాళ్ల కోసమే ఇప్పుడు ఒక కొత్త విధానం కూడా తెరమీదకి వచ్చింది. అదే ‘మైక్రో మెడిటేషన్’. అంటే మనం ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు కొద్ది నిమిషాల పాటు మౌనంగా కూర్చుని ధ్యానం చేయడం అన్నమాట.