బాలాసోర్, డిసెంబర్ 22: స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ‘ప్రళయ్’ క్షిపణిని డీఆర్డీవో బుధవారం మొట్టమొదటిసారి పరీక్షించింది. ఈ పరీక్ష విజయవంతం అయినట్టు డీఆర్డీవో ప్రకటించింది. నిర్దేశించిన లక్ష్యాన్ని క్షిపణి ఛేదించినట్టు పేర్కొన్నది. ఒడిశా తీరంలో ఉదయం 10.30 గంటలకు ఈ పరీక్ష నిర్వహించారు. భూ ఉపరితలం నుంచి ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి దీనిని తయారు చేశారు. దీని పరిధి 150-500 కిలోమీటర్లు. పరీక్ష విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డీఆర్డీవోను ప్రశంసించారు.