వరంగల్ చౌరస్తా: కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా డా. సంధ్యను నియమిస్తూ తెలంగాణ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి డా.క్రిస్టియనా ఉత్తర్వులు జారీ చేశారు. కేఎంసీ ప్రిన్సిపల్‌గా ఇంచార్జి బాధ్యతలు నిర్వహించిన ఆమె కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రిజిస్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కాగా, సీకేఎం హాస్పిటల్ బాధ్యతలు నిర్వహిస్తున్న డా. షర్మిలను జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా బాధ్యతలు అప్పగించారు. కేఎంసీ ఫ్రొఫెసర్లుగా విధులు నిర్వహిస్తున్న డా.మధుబాబును నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా, డాక్టర్ అపర్ణను నర్సంపేట ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా, డా. సూర్యకుమారిని ములుగు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.