హైదరాబాద్ : కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇంచార్జ్ వీసీగా డా. రమేష్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా ఉత్తర్వులు జారీ చేశారు. రమేష్ రెడ్డి ప్రస్తుతం యాదాద్రి భువనగిరి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపప్గా పని చేస్తున్నారు.
గతంలో డీఎంఈగా పని చేసిన విషయం తెలిసిందే. కాగా,అక్రమమార్గంలో విద్యార్థులను పాస్ చేశారని ఆరోపణలు రావడంతో విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న క్రమంలో నందకుమార్రెడ్డి వీసీ పదవికి రాజీనామా చేశారు. ఐదుగురు విద్యార్థులు అక్రమ మార్గంలో పాస్ అయ్యారని వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతున్నది. ఇలాంటి నాటకీయ పరిణామాల మధ్య డాక్టర్ రమేష్ రెడ్డిని ఈ నియామకం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.