అమరావతి : ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఇద్దరు దారుణ హత్యకు ( Double Murder ) గురికావడం పరిసర ప్రాంతాల్లో కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని కొడవలూరు మండలం గండవరం పంట పొలాల్లో ఇద్దరు దారుణ హత్యకు గురి కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
దగదర్తి మండలానికి చెందిన వెంకటేష్ ( 29) , సంగం మండలానికి చెందిన బాల వెంకయ్య (26)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. వీరి హత్యకు పాతకక్షలా ? ఇతర కారణాలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.