– ఆర్డీఓకు బీజేపీ నాయకుల వినతి
కోదా, జూన్ 12 : కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను డ్రా లో కేటాయించిన లబ్ధిదారులకు తక్షణమే అందజేయాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం బిజెపి జిల్లా కమిటీ సభ్యుడు జల్లా జనార్ధన్ ఆధ్వర్యంలో ఆర్డీఓ సూర్యనారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన రెండున్నర ఏళ్లలో నిర్మాణం పూర్తయిన ఇళ్లను పేద ప్రజలకు అందజేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు నేడు శిథిలావస్థకు చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది పేద ప్రజలు ఎండకు ఎండి, వానకు తడుస్తూ దుర్భర జీవితం జీవిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అర్హులైన ఇండ్లను కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మునగాల శ్రీనివాస్, చిలుకూరి శ్రీను, గంగిరెడ్డి రాకేష్ రెడ్డి, పైడిమర్రి సతీష్, కనుమర్లపూడి శ్రీహరి, కుదుమురి ఈశ్వరరావు, అనిల్ పాల్గొన్నారు.