తిరుమల : హైదరాబాద్ కు చెందిన పి.శ్రీకాంత్ అనే భక్తుడు శుక్రవారం టీటీడీ ( TTD ) శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు ( Annaprasadam Trust ) రూ.25 లక్షలు విరాళంగా( Donation ) అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 26 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు ఉన్న భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 66,149 మంది భక్తులు దర్శించుకోగా 24,429 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.66 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.