Donald Trump | చివరి నిమిషంలో తల తిప్పడంతో.. ప్రాణాలతో బయటపడ్డ డొనాల్డ్ ట్రంప్!
అమెరికాలోని పెన్సిల్వేనియాలో శనివారం ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనలో ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
- ఆయన్ను బతికించిన సభలోని ఓ చార్ట్
- అందులోని వివరాలు చెప్పేందుకు తల కొద్దిగా తిప్పిన మాజీ అధ్యక్షుడు
- లేకుంటే నేరుగా తలలోకి బుల్లెట్
- నేనసలు చనిపోయాననే అనుకొన్నా
- ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో ట్రంప్
Donald Trump | న్యూఢిల్లీ, జూలై 15: అమెరికాలోని పెన్సిల్వేనియాలో శనివారం ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనలో ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. చివరి నిమిషంలో ఆయన తల కొద్దిగా తిప్పడంతో దుండగుడు కాల్చిన బుల్లెట్ కుడి చెవిలో నుంచి పోయిందని, లేకుంటే సూటిగా తలలోకి దూసుకుపోయేదని దాడికి సంబంధించిన వీడియోలు, అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ వేదికపై మాట్లాడుతూ తనకు కుడివైపున ఉన్న ఓ అక్రమ వలసదారుల గణాంకాలకు సంబంధించిన చార్ట్‌ను చూపిస్తూ అటు వైపు తల తిప్పారు. ఆ తర్వాత దుండగుడు కాల్పులు జరపగా బుల్లెట్ ట్రంప్ చెవిని తాకింది. ఒక వేళ ట్రంప్ అటువైపు తిరగకుంటే బుల్లెట్ నేరుగా తలలోకి దూసుకెళ్లేది.
ఈ విషయాన్ని ట్రంప్ కూడా వెల్లడించారు. ‘ఆ చార్ట్ తన ప్రాణాలను కాపాడింది’ అని హత్యాయత్నం తర్వాత వైట్‌హౌస్ మాజీ ఫిజిషియన్ రిప్రజంటేటివ్ రాన్నీ జాక్సన్‌కు ఫోన్ కాల్లో తెలిపారు. తనపై హత్యాయత్నంపై ట్రంప్ వార్తా సంస్థతో మాట్లాడారు. ‘అసలు నేను మీ ముందు ఇలా ఉండేవాడినే కాదు. కాల్పుల ఘటనలో చనిపోయాననే అనుకొన్నా. ఇదొక విచిత్రమైన పరిస్థితి’ అని పేర్కొన్నారు. రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో పాల్గొనేందుకు విమానంలో వెళ్తూ ట్రంప్ ఈ విధంగా స్పందించారు. ఈ కన్వెన్షన్‌లో ట్రంప్ తన ఉపాధ్యక్ష అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశం ఉన్నది. జేడీ వాన్స్, మార్కో రూబియో, డగ్ బర్గమ్ ఉపాధ్యక్ష రేసులో ఉన్నారు.
భద్రతా సిబ్బందికి చెప్పినా..
ట్రంప్‌పై హత్యాయత్నం ఘటనలో యూఎస్ సీక్రెట్ సర్వీస్ వైఫల్యం ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బుల్లెట్‌ను కాల్చడానికి ముందు నిందితుడు ట్రంప్ సభా వేదికపై 150 మీటర్ల దూరంలోని ఓ రూఫ్‌పై నక్కి ఉండటంపై సభకు హాజరైన కొంత మంది అధికారులకు తెలిపినా పట్టించుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి.
జగన్నాథుడి కృపే కారణం: ఇస్కాన్
ట్రంప్ ప్రాణాలతో బయటపడటానికి పూరీ జగన్నాథుడి కృపే కారణమని ఇస్కాన్ వ్యాఖ్యానించింది. 48 ఏండ్ల క్రితం రథయాత్రకు ట్రంప్ సహకారం అందించాడని, ఆ భగవంతుడి అనుగ్రహమే ఆయన్ను రక్షించిందని ఇస్కాన్ ప్రతినిధి రాధారమణ్ దాస్ అభిప్రాయపడ్డారు. 1976లో ఇస్కాన్ భక్తులు రథయాత్ర కోసం రథాలు సిద్ధం చేసుకొనేందుకు ఉచితంగా తన ట్రైన్‌యార్డ్‌ను ఇచ్చి ట్రంప్ సహకరించారని తెలిపారు.
ట్రంప్‌పై రహస్య పత్రాల కేసు కొట్టివేత
ట్రంప్‌నకు భారీ ఊరట లభించింది. రహస్య పత్రాల తరలింపునకు సంబంధించిన ఆరోపణల కేసును ఫ్లోరిడా కోర్టు కొట్టివేసింది. అభియోగాలు దాఖలు చేసిన ప్రత్యేక న్యాయవాదిని చట్టవిరుద్ధంగా నియమించారని ట్రంప్ తరపు లాయర్ చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది.

నరమేధ ఆయుధం ‘ఏఆర్-15’ రైఫిల్
ట్రంప్‌పై దాడికి నిందితుడు క్రూక్స్ అమెరికాలోనే అత్యంత ప్రాణాంతమైన తుపాకీ ‘ఏఆర్-15’ రైఫిల్‌ను ఉపయోగించాడు. సామూహిక జనహనన ఆయుధంగా దీనికి పేరున్నది. ఆర్మీ లైట్(ఏఆర్)-15 తుపాకీ ఒక సెమీ ఆటోమేటిక్ ఆయుధం. ఇది మోడ్రన్ స్పోర్టింగ్ రైఫిల్(ఎంఎస్ఆర్) విభాగంలోకి వస్తుంది. సైనిక అవసరాల కోసం తయారు చేసిన ఎం-16 రైఫిల్‌కు ఇది పౌర వెర్షన్. ఏఆర్-15ను ప్రధానంగా క్రీడల్లో, జంతువుల వేటలో ఉపయోగిస్తుంటారు. ఏఆర్-15 తుపాకీ నిమిషానికి 45 తూటాలను పేల్చగలదు. అత్యంత వేగంతో దూసుకొచ్చే దీని బుల్లెట్ తగిన చోట శరీరాన్ని చిధ్రం చేస్తుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

