యజమాని జేబులో నుంచి కింద పడిన ఎయిర్‌పాడ్స్‌ను ఓ పెంపుడు కుక్క గుటుక్కున మింగేసింది. పశు వైద్యులు ఆ శునకానికి సర్జరీ చేసి దాని కడుపులో నుంచి ఎయిర్‌పాడ్స్ బయటకు తీశారు. ఆ ఎయిర్‌పాడ్స్ చక్కగా పనిచేస్తుండటంతో పశువైద్యులు ఆశ్చర్యపోయారంట. ఈ విషయాన్ని కుక్క యజమాని అయిన 22 ఏండ్ల రాచెల్ ఫేస్బుక్లో పంచుకున్నారు.
తన పెంపుడు కుక్క జిమ్మీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక ఖాతా ఉన్నది. ఆ ఖాతాలో ఈస్టర్ ఆదివారం సందర్భంగా తీసిన జిమ్మీ ఫొటోలను అప్లోడ్ చేసేందుకు రాచెల్ నిమగ్నమై ఉండగా.. పొరపాటున ఆమె జేబులో నుంచి ఎయిర్‌పాడ్స్ కింద పడిపోయాయి. అవేంటో తెలియని జిమ్మీ.. తన కోసమే అయి ఉంటుందని చటుక్కున నోట కరుచుని గుటుక్కున మింగేసింది.
ఇది గమనించిన రాచెల్.. వెంటనే తన కుక్కను పశువైద్యుడి వద్దకు తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు జిమ్మీకి సర్జరీ చేసి దాని కడపులో ఉన్న ఎయిర్‌పాడ్స్ బయటకు తీశారు. కుక్క నోటి నుంచి బయటకు తీసిన తర్వాత కూడా ఆ ఎయిర్‌పాడ్స్ నిక్షేపంగా పనిచేస్తుండటం చూసి వైద్యులు నోరెళ్లబెట్టారంట. ‘ఎయిర్‌పాడ్స్ బ్యాటరీలో ఆసిడ్ ఉంటున్నందున.. ఎవరి కుక్కైనా ఇలా ఎయిర్‌పాడ్స్ మింగితే వెంటనే సర్జరీ చేసి తొలగించండి.. లేదంటే ఆ ఆసిడ్ కుక్కకు హాని కలిగిస్తుంది..’ అని రాచెల్ సలహా కూడా ఇచ్చారు.
శస్త్రచికిత్స తర్వాత కోలుకున్న ఆ కుక్క ఆ రాత్రి క్లినిక్‌లోనే గడిపింది. మరుసటి రోజు కట్లతో ఇంటికి చేరిన జిమ్మీ.. ఓ మూలన పడుకుని ఉండిపోయింది. ఏదేమైనా, ఈ సంఘటన తప్పనిసరిగా ‘ఇతర కుక్కల యజమానులకు జాగ్రత్త అనేది చెప్తుంది’ అని కూడా రాచెల్ పేర్కొన్నారు. పెంపుడు కుక్క ఇంట్లో ఏమి తింటుందో కూడా ఓ కన్నేసి ఉంచాలన్న జ్ఞానం తనకు వచ్చిందని ఆ అమ్మడు చెప్తుందంట.
కొవిడ్ వారియర్స్‌కు తాజాగా బీమా పాలసీ
కేరళ వ్యక్తి చేతిలో జీవం పోసుకున్న బుల్లి మహీంద్ర జీపు
ఈ 8 చెడు అలవాట్లు మానుకోండి.. ఆయుష్షు పెంచుకోండి..!
మీ కాలేయాన్ని ఇలా ఆరోగ్యంగా ఉంచుకోండి.. ఇవాళ వరల్డ్ లివర్ డే
వచ్చే నెల మొదటి వారంలో కరోనా ఉధృతి : ఐఐటీ కాన్పూర్ అధ్యయనం
అక్టోబర్‌లో రానున్న జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’
బ్రిటన్‌లో లాక్‌డౌన్‌కు విశ్రాంతి.. జనంతో నిండిపోయిన రెస్టారెంట్లు
అంతరిక్షంలోకి ఆర్యభట్ట.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..