న్యూఢిల్లీ, ఆగస్టు 13: భారత్లో అత్యంత తీవ్రంగా పెరుగుతున్న కుక్క కాట్ల బెడద పట్ల ప్రజారోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క 2024లోనే దేశంలో 37.17 లక్షల కేసులు నమోదయ్యాయి. అంటే సగటున రోజుకు 10,000కిపైగా కుక్క కాటు కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది రేబిస్ వ్యాధి నివారణ లక్ష్యలకు, వాస్తవ పరిస్థితికి మధ్య ఎంత అంతరం ఉందో తెలియచేస్తుంది. రేబీస్ వ్యాధితో మరణించిన వారి సంఖ్యపై అధికారిక లెక్కలు దిగ్భ్రాంతికి గురిచేస్తాయి.
ప్రభుత్వ లెక్కల ప్రకారం 2022లో కేవలం 21 రేబిస్ మరణాలు మాత్రమే సంభవించాయి. కాని, భారత ప్రభుత్వ లెక్కలను, ఇతర దేశీయ వర్గాలను ఆధారంగా చేసుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించిన వివరాల ప్రకారం అదే ఏడాది దాదాపు 305 మంది రేబిస్ కారణంగా మరణించారు. కాగా, డబ్ల్యూహెచ్ఓ అంచనాల ప్రకారం భారత్లో ఏటా 18,000 నుంచి 20,000 రేబిస్ మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచ రేబిస్ మరణాలలో ఇది 36 శాతానికి పైగా ఉంటుంది. కుక్క కాటుకు గురవుతున్న వారిలో 15 ఏళ్ల లోపు పిల్లలే అధికంగా ఉండడంతో మరణాలు కూడా వారిలోనే అధికంగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
కొవిడ్ తర్వాత పెరిగిన కేసులు
కొవిడ్ కాలంలో దేశంలో కుక్క కాటు కేసులు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2018లో 75.7 లక్షల కేసులు నమోదు కాగా 2021లో అవి 17 లక్షలకు తగ్గిపోయాయి. అయితే ఆ తర్వాత నుంచి కుక్క కాటు కేసులు దేశంలో పెరిగిపోయాయి. 2024లో దేశంలో 37.2 లక్షల కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 2022, 2024 మధ్య 13.5 లక్షల కేసులు
నమోదుకాగా ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు(12.9 లక్షలు), గుజరాత్ (8.4 లక్షలు) ఉన్నాయి.
అత్యధిక వీధి కుక్కలు ఉన్న రాష్ర్టాలు (2019 లెక్కల ప్రకారం)
కుక్కకాటు కేసులు రాష్ర్టాల వారీగా (2022-24 మధ్య)
సంవత్సరాల వారీగా కుక్క కాటు కేసులు