తుంగతుర్తి, జులై 01 : తుంగతుర్తి నియోజవర్గ కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో వైద్య సిబ్బంది బుధవారం డాక్టర్స్ డే సందర్భంగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్లకు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ సమాజంలో అన్ని వృత్తుల కన్నా వైద్య వృత్తి ఎంతో ప్రత్యేకమైనదని డాక్టర్లుగా తాము ప్రజల ప్రాణాలు కాపాడుతుంటే ఎంతో సంతోషం కలుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ల నర్సింగ్, హెడ్ నర్సులు, శానిటేషన్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.