Belgium | బెల్జియంలో భారీ అగ్ని ప్రమాదం.. పదంతస్తుల బిల్డింగులో మంటలు.. ఆరుగురు మృతి
Belgium : బెల్జియంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పదంతస్తులున్న ఒక రెసిడెన్షియల్ బిల్డింగులో మంటలు చెలరేగడంతో ఆరుగురు మరణించారు. మరికొందరు ఇంకా మంటల్లోనే చిక్కుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు.
Belgium : బెల్జియంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పదంతస్తులున్న ఒక రెసిడెన్షియల్ బిల్డింగులో మంటలు చెలరేగడంతో ఆరుగురు మరణించారు. మరికొందరు ఇంకా మంటల్లోనే చిక్కుకున్నారు. బెల్జియంలోని ఆంట్వెర్ప్ అనే పోర్ట్ సిటీలో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.50 గంటలకు ఈ ఘటన జరిగింది. లెఫ్ట్ బ్యాంక్ పరిధిలోని ఒక పదంతస్తుల రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. ఈ బిల్డింగులో దాదాపు 200 మందికిపైగా నివసిస్తున్నారు.
ఎనిమిదో ఫ్లోర్లో మొదలైన మంటలు నెమ్మదిగా ఇతర ఫ్లోర్లకు వ్యాపించాయి. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే స్మోక్ డిటెక్టర్స్ పనిచేసి, అలారంలు మోగాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. బిల్డింగులో చిక్కుకున్నవారిని యుద్ద ప్రాతిపదికన రక్షించే చర్యలు చేపట్టారు. పక్కనున్న బిల్డింగ్ నుంచి తాడు ద్వారా సహాయక బృందాలు ప్రమాదం జరిగిన బిల్డింగులోకి వెళ్లాయి. . స్పెషలైజ్డ్ డ్రోన్లను కూడా వాడుతున్నారు. అగ్నిప్రమాదం కారణంగా చాలా మంది మంటల్లోనే చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఆరుగురు మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మరికొందరు గాయపడ్డారు. వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మంటల్లో చిక్కుకున్న మిగతావారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు భారీగా వ్యాపించడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. పొగ భారీగా వ్యాపించడంతో ముందు జాగ్రత్తగా సూచనలు చేశారు. చుట్టుపక్కల నివసించే వారు తమ కిటికీలు, వెంటిలేషన్ మూసేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మృతులు, క్షతగాత్రులకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులు ప్రకటించాల్సి ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Antwerp
- Belgium
- fire
- Firefighters
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

