మునగాల, ఆగస్టు 26 : ఖమ్మం జిల్లాకు నీ ళ్లిచ్చి సూర్యాపేట సొంత జిల్లా రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్ల య్య యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రం శివారులోని సాగర్ ఎడమ కాలువను రైతులతో కలిసి సందర్శించారు. పంటలకు సాగు నీటిని అందించాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఎండిపోయిన సాగర్ ఎడమ కాలువలోకి దిగి ధర్నా చేశారు.
ఈ సందర్భంగా మల్లయ్య యాద వ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను ఆం ధ్రపాలకులకు తాకట్టు పెట్టారని విమర్శించారు. కృష్ణా, గోదావరి నదులకు వచ్చి నీటిని ఆంధ్రాకు తరలిపోతున్నా సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదని మండిమడ్డారు. ఆంధ్రా సీఎంకు ఊడిగం చేసేందుకు ముఖ్యమంత్రివి అయ్యావా? అని రేవంత్‌రెడ్డిపై ఆగ్ర హం వ్యక్తంచేశారు. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీకి చేరినప్పటికీ కేసీఆర్ రైతులకు నీళ్లు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్ర సమస్యలను పక్కనపెట్టి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయడమే రేవంత్‌రెడ్డికి సరిపోతుందని, ఇక రైతుల సమస్యలు ఎలా పట్టించుకుంటారని ఎద్దేవా చేశారు.