హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : ఆరెకటిక సంఘం రాష్ట్రస్థాయి కార్యవర్గ ఎన్నికను అక్టోబర్2న నిర్వహించనున్నట్టు ఆరెకటిక ట్రస్టు, ఎన్నికల కమిటీ ప్రతినిధులు జమాల్పూర్ బాలరాజు, నిజాంకార్ చంద్రశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌తోపాటు జిల్లాలు, తాలూకాలు, పట్టణాలు, మండల కేంద్రాల నుంచి ఆరెకటిక సామాజిక వర్గానికి చెందిన వివిధ స్థాయి సంఘాలు, సేవా సంస్థలు, కులాభివృద్ధిని ఆకాంక్షించే ప్రతినిధులు ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 1లోగా ఓటు నమోదు, 2న ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయనున్నట్టు వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒకరూ నిర్ణీత గడువులోగా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.