అందంగా కనిపించడానికి మార్కెట్లో ఉన్న కాస్మొటిక్సే వాడాలని లేదు. ఖరీదైన క్రీములు, పేరున్న సెలూన్ల సేవల అవసరమే లేకుండా.. చర్మాన్ని అందంగా మార్చుకునేందుకు చిన్న చిన్న ప్రయత్నాలు చేసినా ఫలితాలు ఉంటాయి. చర్మంలో తేమను పెంచుకుని కాంతిమంతంగా మార్చుకోవడానికి, స్కిన్ టెక్చర్ని కాపాడుకోవడానికి పాలు, పసుపు రాస్తే చాలు. పాలలో పసుపు కలిపి ముఖం, కాళ్లు, చేతులకు (ఎండ సోకే భాగాలకు) రోజూ రాసుకుంటే చర్మం కోల్పోయిన సహజత్వం తిరిగి వస్తుంది.
పాలలో ఉండే కొవ్వులు చర్మంపై ఒక పొరలా ఉండిపోతాయి. ఇది చర్మంలో తేమను పెంచడానికి ఉపయోగపడుతుంది. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ చర్మంపై ఉండే సూక్ష్మమైన పగుళ్లను తగ్గిస్తాయి. మొటిమలను కూడా నివారిస్తాయి. పాలు, పసుపు కలిపిన మిశ్రమం ముఖానికి ఐప్లె చేసి… పదిహేను నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడగాలి. ఇలా కొన్నాళ్లు చేస్తే పసుపులోని రంగు, పాలలోని వెన్న చర్మానికి కొత్త కాంతినిస్తాయి. ఇలా ప్రయత్నించడానికి స్వచ్ఛమైన పాలనే వాడండి. ప్యాకెట్ పాలు వద్దు.