పరిగి : ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో తమ పొలాలను అన్యాయంగా లాక్కోవద్దని రైతులు ఆందోళనకు దిగారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ పేరిట పరిగి నియోజకవర్గం కాడ్లాపూర్, రాపోలు గ్రామాల్లో మొత్తం 1200 ఎకరాల భూమిని కాంగ్రెస్ సర్కారు అన్యాయంగా దోచుకుంటున్నది.
ఈ నేపథ్యంలో తమ పొలాలను ఇండస్ట్రియల్ పార్క్ కోసం లాక్కోవద్దంటూ పరిగి బస్టాండ్ ముందు ఇవాళ రైతులు ఆందోళన చేపట్టారు. అయితే ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా.. పంటలు పండే తమ భూములు లాక్కోవద్దంటూ రైతులు పోలీసుల కాళ్ల మీద పడి ప్రాధేయపడ్డారు.
అయినా పోలీసులు వినిపించుకోలేదు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై దాడి చేశారు. మహిళలు అని కూడా చూడకుండా విచక్షణారహితంగా తోసేశారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రేవంత్ సర్కారు తమ దందా కోసం రైతుల పొలాలను గుంజుకోజూస్తున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వాన్ని రైతులే తరిమికొడుతారని అన్నారు.
ఇండస్ట్రియల్ పార్క్ పేరిట పరిగి నియోజకవర్గం కాడ్లాపూర్, రాపోలు గ్రామాల్లో 1200 ఎకరాల భూమిని అన్యాయంగా దోచుకుంటున్న రాక్షస కాంగ్రెస్ సర్కార్.
తమ పొలాలను ఇండస్ట్రియల్ పార్క్ కోసం లాక్కోవద్దంటూ పరిగి బస్టాండ్ ముందు రైతుల ఆందోళన. పంటలు పండే తమ భూములు లాక్కోవద్దంటూ పోలీసుల కాళ్ళ మీద… pic.twitter.com/pHGWY2a0C8
— BRS Party (@BRSparty) March 26, 2026