వాహనాల్లో పెట్రోల్, డీజిల్‌ను ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవద్దు. ఎండాకాలం కాబట్టి పేలిపోయే ప్రమాదం ఉంది. ట్యాంకుల్లో కొంత గాలి ఉండాలి. రోజుకు ఒక్కసారైనా ట్యాంకు మూత తెరవండి. బైకుల్లో పెట్రోల్ ఫుల్ ట్యాంకు పోయడం వల్ల ఈ వారంలో 5 బైకులు పేలిపోయాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) పేర్కొంది అంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్నది.
ఎండాకాలమైనా.. ఏ కాలమైనా ఫుల్ ట్యాంక్ కొట్టించుకొంటే వాహనాలు పేలిపోవని ఐవోసీ స్పష్టం చేసింది. ఈ వారంలో 5 బైకులు పేలిపోయాయని తాము చెప్పినట్టు జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చింది. పెట్రోల్ ఫుల్ ట్యాంకు పోయించిన కారణంగా ఏ బైక్ పేలిపోలేదని వెల్లడించింది. అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని వినియోగదారులకు సూచించింది.