న్యూఢిల్లీ : రెండేండ్ల లోపు వయసు గల చిన్నారులకు దగ్గు, జలుబు మందులను సూచించరాదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) శుక్రవారం చెప్పింది. ఈ మేరకు అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను జారీ చేసింది.
మధ్య ప్రదేశ్, రాజస్థాన్లలో కలుషిత దగ్గు మందు వాడకం వల్ల చిన్నారులు మరణించినట్లు వచ్చిన కథనాల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. మధ్య ప్రదేశ్ నుంచి సేకరించిన దగ్గు మందు నమూనాల్లో మూత్రపిండాలు దెబ్బతినడానికి కారణమయ్యే పదార్థాలు కనిపించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.