న్యూఢిల్లీ: ప్రభుత్వ నిధులు పొందాలంటే విదేశీ విద్యార్థుల అడ్మిషన్లను పరిమితం చేయాలని ట్రంప్ ప్రభుత్వం అమెరికన్ యూనివర్సిటీలకు తెలిపింది. ఇందుకు సంబంధించి 10 అంశాలతో కూడిన మెమోను ప్రభుత్వం యూనివర్సిటీలకు బుధవారం పంపింది.
విదేశీ విద్యార్థుల అడ్మిషన్లను పరిమితం చేయడం, జాతి, లింగ ఆధారిత అడ్మిషన్లను నిషేధించడం, విద్యార్థులకు ప్రామాణిక పరీక్ష నిర్వహించిన తర్వాతే అడ్మిషన్లు ఇవ్వడం వంటివి ప్రభుత్వం మెమోలో ఉన్నాయి. పాలస్తీనా అనుకూల నిరసనలు నిర్వహించడం, ట్రాన్స్జెండర్ విధానాలు వంటి చర్యలకు విద్యార్థులను అనుమతిస్తే ప్రభుత్వ నిధులను కోల్పోవలసి వస్తుందని హెచ్చరించింది.