ఒడిశా హైకోర్టు సీజే మురళీధర్
కటక్: తనను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ‘మై లార్డ్’, ‘యువర్ లార్డ్‌షిప్’ వంటి పదాలను వినియోగించొద్దని ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధర్ న్యాయవాదులను కోరారు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించనున్న కేసుల జాబితాకు ఈ నోట్‌ను అటాచ్ చేశారు. మై లార్డ్, యువర్ లార్డ్‌షిప్, యువర్ హానర్, హానరబుల్ వంటి పదాలను వినియోగించడాన్ని నివారించేందుకు ప్రయత్నించాలని, సర్ వంటి పదంతో సంబోధిస్తే సరిపోతుందని జస్టిస్ మురళీధర్ పేర్కొన్నారు.