
నర్సాపూర్,డిసెంబర్ 3: దివ్యాంగులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి అనిత అన్నారు. శుక్రవారం పట్టణంలో మండల మానవ వనరుల కేంద్రం ఆవరణలో ప్రత్యేక అవసరాల పిల్లల కేంద్రంలో దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం దివ్యాంగుల పిల్లలకు బహుమతులు, పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడ్వకేట్లు ప్రకాశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
రామాయంపేటలో..
రామాయంపేట, డిసెంబర్ 3: విద్యార్థులు ఆటపాటల్లో ప్రతిభ కనబర్చాలని జిల్లా దివ్యాంగుల విద్యార్థుల సమన్వయకర్త డాక్టర్ సూర్యప్రకాశ్‌రావు అన్నారు. ప్రపంచ దివ్యాంగుల విద్యార్థుల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని భవిత కా ర్యాలయంలో దివ్యాంగుల విద్యార్థులు, తల్లితండ్రులతో స మావేశం ఏర్పాటు చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల విద్యార్థుల కోసం ప్రభుత్వం ఉచితంగా నోటు పుస్తకాలు ఇతర సదుపాయాలను కల్పిస్తున్నదన్నారు.కార్యక్రమంలో రామాయంపేట ఎంపీడీవో యాదగిరిరెడ్డి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ స్వరూప, ప్రభుత్వ బాలికల హెచ్ఎం ప్రసన్నమణి, ఎంఐసీ సంతోశ్, సీసీ శంకర్, సీఆర్పీ రాజుతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కొల్చారంలో..
కొల్చారం, డిసెంబర్ 3: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల వనరుల కేంద్రంలో పలు పాఠశాలలకు చెందిన దివ్యాంగుల పిల్లలకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలైన వారికి బహుమతులను తహసీల్దార్ చంద్రశేఖర్‌రావు, ఎంఈవో నీలంకంఠం అందజేశారు. పలు పాఠశాలలకు చెందిన 33 మంది దివ్యాంగులు ఈ పోటీల్లో పాల్గొన్నా రు. కార్యక్రమంలో ప్రత్యేక అవసరాల పిల్లల ఉపాధ్యాయుడు కనకరాజు, మండల వనరుల కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
నిజాంపేటలో..
నిజాంపేట, డిసెంబర్ 3: నస్కల్ లోని ప్రభు త్వ ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి, ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశా రు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సునీల్, ఉపాధ్యాయులు సంధ్యారాణి, లక్ష్మి, రాజయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
మెదక్ మున్సిపాలిటీలో..
మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 3: దివ్యాంగుల దినోత్సవం మండల వనరుల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు డీఈవో రమేశ్‌కుమార్ బహుతులు అందజేశారు.కార్యక్రమంలోమండల విద్యాధికారి నీలకంఠం, ఐఈఆర్పీ పద్మ తదితరులు పాల్గొన్నారు.