ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో సుప్రసిద్ధ ఆదివాసి దైవ క్షేత్రం నాగోబా ఆలయాన్ని ( Nagoba Temple ) జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ( SP Akhil Mahajan ) సోమవారం సందర్శించారు. ఆలయ ధర్మకర్తలు కమిటీ సభ్యులు ఆదివాసి పద్ధతిలో జిల్లా ఎస్పీకి ఆహ్వానం పలికారు. జిల్లా ఎస్పీ , ఉట్నూరు ఏఎస్పీ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు జిల్లా పోలీసు అధికారులను శాలువాతో సత్కరించారు.
అనంతరం బందోబస్తు నిర్వహిస్తున్న అధికారులకు పలు సూచనలు చేశారు . నాగుల పంచమి సందర్భంగా భక్తుల అధిక సంఖ్యలో వచ్చే అవకాశముండడంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూరు ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే , ఉట్నూర్ సీఐ ఎం ప్రసాద్, ఇంద్రవెల్లి ఎస్సై సాయన్న, ఎస్సై విక్రమ్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.