కాసిపేట : మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ టీచర్‌గా ( Collector Kumar Deepak) మారారు. గురువారం కాసిపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌ను తనిఖీ చేసిన సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు గణితం సబ్జెక్టును ( Mathematics ) బోధించారు. విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా సామర్ధ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు గణితంపై పలు అంశాలను వివరించారు. కలెక్టర్ స్వయంగా మ్యాథ్స్ సబ్జెక్టు పై మెలుకువలు నేర్పిస్తుంటే విద్యార్థులు శ్రద్ధగా పాఠాలను విన్నారు. విద్యార్థులతో చాలాసేపు తరగతి గదిలోనే ఉండి పాఠాలు బోధిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు.