లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
మండల కేంద్రమైన బూర్గంపహాడ్ రైతు వేదికలో టేకులచెరువు పంచాయతీకి చెందిన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
బూర్గంపహాడ్, నవంబర్ 09 : మండల కేంద్రమైన బూర్గంపహాడ్ రైతు వేదికలో టేకులచెరువు పంచాయతీకి చెందిన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అర్హులైన నిరుపేద కుటుంబాలకు సొంతింటి కల సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుందని, సొంత ఇల్లులేని నిరుపేద కుటుంబాలను గుర్తించి ఇళ్ల పత్రాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఆడబిడ్డల వివాహాలకు ఆర్ధిక భరోసా కల్పించేందుకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్ధికసాయం అందిస్తుందని, నిరుపేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జమలారెడ్డి, తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్, హౌసింగ్ ఏఈ ఉదయ్ కిరణ్, మండల అధ్యక్షుడు పూలపెల్లి సుధాకర్‌రెడ్డి, భజన ప్రసాద్, సర్పంచ్, ఉప సర్పంచులు మందా నాగరాజు, గుండె వెంకన్న, వారాల వేణు, ఆయా పంచాయతీల సర్పంచ్, ఉప సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
Man Killed, Cop Injured In Firing | బంగారం లావాదేవీపై వివాదం.. కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి, పోలీస్ అధికారికి గాయాలు
Police Raids | అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల మెరుపు దాడులు .. నాలుగు టిప్పర్లు సీజ్
Sangam Banda canal | నెలలుగా సాగునీరు వృథా.. పట్టించుకోని ఇరిగేషన్ శాఖ
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి : హాలియా ఏడీఏ సరిత
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

