Man Killed, Cop Injured In Firing | బంగారం లావాదేవీపై వివాదం.. కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి, పోలీస్ అధికారికి గాయాలు
Man Killed, Cop Injured In Firing | దీపావళి సందర్భంగా బంగారం లావాదేవిపై ఇరు వర్గాల మధ్య వివాదం జరిగింది. ఈ సందర్భంగా కాల్పులు జరిగాయి. ఒక వ్యక్తి మరణించగా, పోలీస్ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చండీగఢ్: దీపావళి సందర్భంగా బంగారం లావాదేవిపై ఇరు వర్గాల మధ్య వివాదం జరిగింది. ఈ సందర్భంగా కాల్పులు జరిగాయి. ఒక వ్యక్తి మరణించగా, పోలీస్ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (Man Killed, Cop Injured In Firing) పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఈ సంఘటన జరిగింది. ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి తన స్నేహితులకు 1,400 గ్రాముల బంగారం ఇచ్చాడు. ఈ వివాదంపై ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
కాగా, ఆదివారం దీపావళి సందర్భంగా అమృత్‌సర్‌లోని సుల్తాన్‌విండ్ రోడ్డులో ఉన్న ‘రంఝే ది హవేలీ’ సమీపంలో ప్రతాప్ సింగ్ అతడి సోదరుడు, బంగారం ఇచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య మళ్లీ వాగ్వాదం చెలరేగింది. దీంతో ఒక వర్గం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బి డివిజన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) హర్నేక్ సింగ్, సీనియర్ కానిస్టేబుల్ సాహిబ్ సింగ్ అక్కడకు చేరుకున్నారు.
మరోవైపు సోదరులతో ఒకరిని పోలీసులు పట్టుకోగా వారి సహచరులు వెనుక నుంచి వచ్చి కాల్పులు జరిపి పారిపోయారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ప్రతాప్ సింగ్ అక్కడికక్కడే మరణించాడు. ఎస్ఐ హర్నేక్ సింగ్ తొడ భాగంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కాల్పుల శబ్దానికి ఆ ప్రాంత ప్రజలు భయాందోళన చెందారు. ప్రాణాలను కాపాడుకునేందుకు వారు పరుగులు తీశారు.
కాగా, ఈ కాల్పుల సమాచారం తెలియడంతో బి డివిజన్ పోలీస్ స్టేషన్ నుంచి మరో బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నది. కాల్పుల్లో మరణించిన ప్రతాప్ సింగ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కాల్పుల సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Amritsar
- Cop
- Diwali night
- Firing
RELATED ARTICLES
తాజా వార్తలు
సాకివాగులో ఘనంగా జన జాతీయ గౌరవ దివస్ వేడుకలు
లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
Man Killed, Cop Injured In Firing | బంగారం లావాదేవీపై వివాదం.. కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి, పోలీస్ అధికారికి గాయాలు
Police Raids | అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల మెరుపు దాడులు .. నాలుగు టిప్పర్లు సీజ్
Sangam Banda canal | నెలలుగా సాగునీరు వృథా.. పట్టించుకోని ఇరిగేషన్ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

