తిరుమల : పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల ( Tirumala ) లో శ్రీవారి ఆలయం ఎదుట నిబంధనలకు విరుద్ధంగా అన్నాడీఎంకే (AIADMK posters ) పోస్టర్ల ప్రదర్శన వివాదస్పదమవుతుంది . ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని టీటీడీ ప్రకటించింది. ఇటీవల తమిళనాడుకు చెందిన భక్తులు అన్నా డీఎంకేకు పోస్టర్లను ప్రదర్శించిన వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
తిరుమలలో రాజకీయ ప్రచారాలు, రాజకీయ చిహ్నాల ప్రదర్శన నిషేధం కాగా తమిళ భక్తులు నిబంధనలు విరుద్ధానికి పాల్పడ్డారని టీటీడీ అధికారులు ఖండించారు. పోస్టర్ ప్రదర్శించిన తమిళ భక్తులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.