మెదక్ : హవేలీ ఘనపూర్ మండలం తోగిటలో వినాయక నిమజ్జనంలో (Genesh Immersion) అపశ్రుతి చోటు చేసుకుంది. సుధాకర్ (17) అనే యువకుడు రామస్వామి కుంట లో మునిగి మృతి చెందాడు. గ్రామంలోని రామస్వామి కుంటలో గణపతి నిమజ్జనం చేయడానికి వెళ్లిన యువకుడు కనిపించకపోవడంతో గణపతి మండల నిర్వాహకులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు . పోలీసులు ,గజ ఈతగాలతో కుంటలో వెతకగా సుధాకర్ మృతదేహం లభ్యమైంది . తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హవేలీ ఘనపూర్ పోలీసులు
నమోదు చేశారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.