Ganesh Immersions | ఘనంగా ముగిసిన గణపతి నవరాత్రి ఉత్సవాలు
Ganesh Immersions | గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని తాండూర్ మండలంలో శుక్రవారం వినాయక నిమజ్జన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
తాండూర్ : గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని తాండూర్ ( Tandoor ) మండలంలో శుక్రవారం వినాయక నిమజ్జన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గణపతి బొప్పా మోరియా అంటూ నినాదాలు మిన్నంటగా మండలంలో వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. 9 రోజుల పాటు పూజలందుకున్న ఏకదంతుడికి మండలంలోని ప్రముఖులు పూజలు చేసిన అనంతరం భారీ బందోబస్తు నడుమ శోభాయాత్రను ( Shobayatra ) ప్రారంభించారు.

అందంగా అలంకరించిన వాహనాలలో గణనాధున్ని కొలువుంచి వీధుల్లో ఊరేగించగా ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఆయా ఉత్సవ సమితిల సభ్యులు, యువకులు, మహిళలు, చిన్నారులు డప్పు చప్పుళ్ల మధ్య గణపతి బొప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ కోలాటాలు, నృత్యాలతో మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఊరేగింపులు నిర్వహించారు.
ఐబీలో శ్రీ గణేష్ మండలి వినాయకుడి శోభాయాత్రలో సాంప్రదాయ నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. తమ గృహాల ముందుకు వచ్చిన శోభాయాత్ర రథాలను మహిళలు నీటితో కడిగి మంగళహారతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి మొక్కలు తీర్చుకున్నారు. తాండూర్ సీఐ దేవయ్య ఆధ్వర్యంలో తాండూర్, మాదారం ఎస్సైలు డీ కిరణ్ కుమార్, సౌజన్య పోలీసుల భారీ బందోబస్తు నడుమ శోభాయాత్రలు ముందుకు సాగాయి.
మండల కేంద్రంలోని శ్రీ గణేష్ మండలి నిర్వహకులు నవరాత్రుల్లో పూజించిన లడ్డును వేలం వేయగా రూ.51,111లకు కొత్తపల్లి గ్రామానికి చెందిన తాండూరి బాపురావు రజిత దంపతులు కైవసం చేసుకున్నారు. బంగారు లక్ష్మి, గణపతి ప్రతిమలను రూ.77,777లకు మండల కేంద్రానికి చెందిన సూరినేని రవీందర్ రావు సరోజ దంపతులు, దుగ్యాల హనుమంతరావు రేఖరాణి దంపతులు ఇరువురు వేలంలో కైవసం చేసుకున్నారు. కలశాన్ని ఠాకూర్ ఉమ్రావ్ సింగ్ సుహాసిని దంపతులు రూ. 5,555 లకు దక్కించుకున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్సుఖ్నగర్లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
Salman Khan | రూ.4 వేల కోట్ల బడ్జెట్ కాదు,రాముడు, సీత పాత్రల గొప్పతనంపై మాట్లాడాలి.. ‘రామాయణం’పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Mammootty | ఏడేళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్నా.. ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమ్ముట్టి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

