రామగిరి, సెప్టెంబర్ 05 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దోమల రమేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ ఆవార్డు అందుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి డా.యోగితా రాణా, ఎంజీయూ వీసీ ప్రొ॥ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ చేతుల మీదుగా ఆయన అవార్డును స్వీకరించారు. దీంతో ఆయనకు కుటుంబ సభ్యులు, ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆకుల రవి, సీఓఈ డాక్టర్ జి.ఉపేందర్‌రెడ్డి, స్పోర్ట్స్ బోర్డు డైరెక్టర్ డా.హరీశ్ కుమార్‌తో పాటు పలువురు అభినందనలు తెలిపారు.