హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : మిగులు టీచర్ల సర్దుబాటులో భాగంగా ఇతర స్కూళ్లకు కేటాయించిన టీచర్లు రిపోర్ట్ చేయకపోతే సీసీఏ రూల్స్ ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ హెచ్చరించారు. సర్దుబాటు చేసిన టీచర్లు విధుల్లో చేరారా.. ? లేదా..? అన్నది పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించాలని డీఈవోలను ఆదేశించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : సర్కార్ బడుల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ తగ్గడంపై టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ఆందోళన వ్యక్తంచేశారు. ఒకటో తరగతిలో 2019-20తో పోల్చితే 2025-26లో 45,978 మంది తగ్గడంపై ఆవేదన వ్యక్తంచేశారు. విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్రెడ్డి ఫెయిలయ్యారని.. 20% అడ్మిషన్లు తగ్గడం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నదని మండిపడ్డారు. వేలాది మంది టీచర్, ఎంఈవో, డీఈవో పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యాప్రమాణాలు దెబ్బతింటున్నాయని వాపోయారు. విద్యారంగంపై సీఎం సమీక్షించి.. కారణాలు అన్వేషించి సర్కార్ బడుల్లో అడ్మిషన్లు పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలని సూచించారు.