రవిప్రకాశ్, శివకుమార్, చరిష్మా శ్రీకర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘విద్రోహి’. వి.ఎస్.వి. దర్శకత్వంలో విజ్జన వెంకట సుబ్రహ్మణ్యం నిర్మించిన ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకొని, విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని తొలి పాటను మేకర్స్ విడుదల చేశారు.
అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్ పాటకు విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. ఇప్పటివరకూ రాని కొత్త పాయింట్‌తో ఈ సినిమా రూపొందించామని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శకుడు వి.ఎస్.వి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐబీఎం మెగా మ్యూజిక్ అధినేత పప్పుల కనకదుర్గారావు కూడా పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీశ్ ముత్యాల, సంగీతం: భీమ్స్ సిసిరోలియో.