బెంగళూరు: లైంగికదాడి కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు పరప్పర అగ్రహార జైలు అధికారులు లైబ్రరీ క్లర్క్‌గా పని కేటాయించారు. ఇందుకుగాను అతడికి రోజుకు రూ.522 వేతనంగా అందజేస్తున్నట్టు తెలిసింది.
ఈ బాధ్యతల్ని అతడు కనీసం 12 రోజులపాటు నిర్వర్తించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం, జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు జైల్లో ఏదో ఒక పని చేయాలి. వారి సామర్థ్యాలు, నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకొని ఖైదీలకు పని అప్పగిస్తారు. పరిపాలనా పరమైన పనులను చేయడానికి రేవణ్ణ ఆసక్తి చూపారు.