క్యాన్సర్ పని పట్టే టీకా!.. లక్షలాది వ్యాధిగ్రస్తులకు శుభవార్త
ప్రపంచంలోని లక్షలాది మంది క్యాన్సర్ రోగులకు రష్యా శుభవార్త చెప్పింది. కొవిడ్-19 టీకాల్లో విజయవంతంగా ఉపయోగించిన ఎంఆర్ఎన్ఏ (మెసెంజర్ రిబోన్యూక్లియిక్ యాసిడ్) టెక్నాలజీ ఆధారంగా ఎంటెరోమిక్స్ అనే టీకాను అభివృద్ధి చేసింది.
- అభివృద్ధి చేసిన రష్యా పరిశోధకులు
- క్లినికల్ ట్రయల్స్‌లో 100 శాతం సమర్థత.. సురక్షితం
- త్వరలోనే అందుబాటులోకి వ్యాక్సిన్
మాస్కో: ప్రపంచంలోని లక్షలాది మంది క్యాన్సర్ రోగులకు రష్యా శుభవార్త చెప్పింది. కొవిడ్-19 టీకాల్లో విజయవంతంగా ఉపయోగించిన ఎంఆర్ఎన్ఏ (మెసెంజర్ రిబోన్యూక్లియిక్ యాసిడ్) టెక్నాలజీ ఆధారంగా ఎంటెరోమిక్స్ అనే టీకాను అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీతో తయారైన మొదటి క్యాన్సర్ టీకా ఇదే. క్లినికల్ ట్రయల్స్‌లో ఈ ఎంటెరోమిక్స్ టీకా నూటికి నూరు శాతం సత్ఫలితాలను చూపించింది. పెద్ద కణతులు గల రోగులు ఈ టీకాను తీసుకున్నపుడు, ఆ కణతుల పరిమాణం తగ్గడంతోపాటు, క్యాన్సర్ నాశనమైంది. ‘రష్యా టుడే’ కథనం ప్రకారం, ఈ టీకాకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ అనుమతులు మంజూరైన వెంటనే దీనిని రోగులకు అందుబాటులోకి తీసుకొస్తారు.
ప్రతి రోగికి వ్యక్తిగత అవసరాన్ని గుర్తించి
అత్యంత కచ్చితత్వంతో క్యాన్సర్ కణాలను తుదముట్టించడమే లక్ష్యంగా ఈ ఎంటెరోమిక్స్ టీకాను అభివృద్ధి చేశారు. ఇది కండరాలలోకి ఇచ్చే ఇంజెక్షన్. రష్యాలోని చాలా ఆంకాలజీ సెంటర్లలో ఇప్పటికే దీనిని క్లినికల్‌గా ఉపయోగించారు. కీమోథెరపీ లేదా రేడియేషన్ విధానాల మాదిరిగా కాకుండా ఈ టీకాను ప్రతి రోగికి వ్యక్తిగత అవసరాన్ని గుర్తించి ఇవ్వవలసి ఉంటుంది. రోగులపై ప్రయోగాత్మకంగా పరీక్షించినపుడు తీవ్రమైన దుష్ఫలితాలు కనిపించలేదు. ఈ టీకాను రష్యాకు చెందిన నేషనల్ మెడికల్ రిసెర్చ్ రేడియలాజికల్ సెంటర్, ఎంగెల్హర్డ్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలెక్యులార్ బయాలజీ అభివృద్ధి చేశాయి.
ఎలా పని చేస్తుంది?
ఎంటెరోమిక్స్ టీకా రోగి శరీరంలోని ట్యూమర్ మార్కర్స్‌ను గుర్తించడంలో రోగ నిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తుంది. ఆరోగ్యకరమైన కణాలు, చెడు కణాల మధ్య తేడాను గుర్తించడంలో సహాయపడుతుంది. అనంతరం చెడు కణాలపై దాడి చేసేలా చేస్తుంది. దీనిని రోగులకు ఇచ్చినపుడు, క్యాన్సర్ రకాన్ని బట్టి ట్యూమర్ 60-80 శాతం వరకు తగ్గినట్లు గుర్తించారు. ప్రాణాపాయం నుంచి తప్పించుకునే రేటు కూడా పెరిగినట్లు గమనించారు. ఎంటెరోమిక్స్ టీకా వల్ల రోగులు వారి ట్యూమర్ల ప్రత్యేక జెనెటిక్ ప్రొఫైల్‌కు తగినట్లుగా డిజైన్ చేసిన వ్యాక్సిన్లను తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ఈ విధంగా వ్యక్తిగతంగా రోగ నిర్ధారణ చేసి, టీకాలను ఇవ్వడం వల్ల క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధి స్థాయి నుంచి తట్టుకోగల ఆరోగ్య పరిస్థితి స్థాయికి మారుతుంది. ఫలితంగా లక్షలాది మంది రోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి.
ఎవరి కోసం?
ఊపిరితిత్తులు, రొమ్ము, కొలెరెక్టల్, పాంక్రియాటిక్ క్యాన్సర్లతో బాధపడేవారు ఈ టీకాను వాడవచ్చు. అదేవిధంగా హెరిడిటరీ క్యాన్సర్ సిండ్రోమ్స్‌తో హై రిస్క్ గల రోగులు, కీమోథెరపీ రెసిస్టెంట్ క్యాన్సర్లు గల వారు ఈ టీకా వల్ల ప్రయోజనం పొందవచ్చు. సంప్రదాయ చికిత్సలను తట్టుకోలేని వారు కూడా ఈ టీకా వైపు చూడవచ్చు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

