సిద్ధు జొన్నలగడ్డ, కథానాయకుడిగా రూపొందుతున్న రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలు. ప్రముఖ ైస్టెలిస్ట్ నీరజా కోన ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ప్రతిష్టాత్మక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణం తుది దశకు చేరుకుంది.
తాజాగా కథానాయిక రాశీ ఖన్నా తన షూటింగ్‌ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘కెమెరాలు ఆగిపోయిన తర్వాత కూడా మరిచిపోలేని కథలు కొన్ని ఉంటాయి. అలాంటి కథే ‘తెలుసు కదా’. అద్భుతమైన అనుభవాలను పంచిన ప్రయాణమిది. ఈ జర్నీలో నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మేం సృష్టించిన ఈ ప్రపంచంలోకి మీరు అడుగుపెట్టే రోజుకోసం ఎదురుచూస్తున్నా.’ అని తెలిపారు రాశీ ఖన్నా. దీపావళి కానుకగా అక్టోబర్ 17న విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్ వీఎస్, సంగీతం: తమన్.