వాటికన్ సిటీ: ‘గాడ్స్ ఇన్ఫ్లూయెన్సర్’గా ప్రసిద్ధి పొందిన 15 ఏళ్ల బాలుడు కార్లో అక్యూటిస్.. సెయింట్ హోదా పొందారు. ఈ హోదా పొందిన తొలి మిలీనియల్గా ఆయన ఘనత సాధించారు. 2006 అక్టోబరులో ఆయన లుకేమియాతో బాధపడుతూ మరణించాడు. పోప్ లియో ఆదివారం సెయింట్ పీటర్స్ స్కేర్‌లో జరిగిన కార్యక్రమంలో కార్లోను సెయింట్‌గా ప్రకటించారు.
ఓ వ్యక్తి పవిత్ర జీవితాన్ని గడిపి, ప్రస్తుతం స్వర్గంలో దేవుని వద్ద ఉన్నట్లు చర్చి విశ్వసిస్తే, ఆ వ్యక్తికి సెయింట్‌హుడ్‌ను ప్రకటిస్తుంది. కార్లో కంప్యూటర్ జీనియస్. తక్కువ వయసులోనే కళాశాల స్థాయి ప్రోగ్రామింగ్ పుస్తకాలను చదివేశాడు.