బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటించిన మిస్టీరియస్ థ్రిల్లర్ ‘కిష్కింధకాండ’. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. సాహు గారపాటి నిర్మాత. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం విజయవాడలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
‘కిష్కింధపురి’ హారర్ సినిమాల్లోకెల్లా ప్రత్యేకమైన సినిమా అని, ఇందులో మలుపులు, షాక్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయని, సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాత సాహు గారపాటి నిర్మించారని, దర్శకుడు కౌశిక్ అద్భుతంగా తెరకెక్కించారని, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇదని బెల్లంకొండ సాయిశ్రీనివాస్ అన్నారు.
‘కిష్కింధపురి’ ఓ యూనిక్ హారర్ మూవీ అని, తెలుగులో వచ్చిన బెస్ట్ హారర్ సినిమా ల్లో ఒకటిగా ఈ సినిమా నిలుస్తుందని కథానాయిక అనుపమ పరమేశ్వరన్ నమ్మకం వెలిబుచ్చారు.