విజయ రామరాజు టైటిల్‌రోల్ పోషించిన క్రీడా నేపథ్య చిత్రం ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకుడు. శ్రీని గుబ్బల నిర్మాత. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించిందని చిత్ర యూనిట్ ఆనందం వెలిబుచ్చింది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు విక్రాంత్ మాట్లాడుతూ ‘ఇలాంటి సినిమాలకు ఆదరణ లభిస్తే మరిన్ని మంచి సినిమాలు తీయడానికి ప్రోత్సాహం దొరుకుతుంది.
చూసిన వారంతా సినిమాను అభినందిస్తున్నారు. ఇంకా చాలామంది చూడాలి.’ అన్నారు. తన నటనకు అభినందించి, సపోర్ట్ చేసిన వారందరికీ హీరో విజయ రామరాజు ధన్యవాదాలు తెలియజేశారు.