‘ఇంటర్, ఎంసెట్ ఎగ్జామ్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా ఇది. హీరో మౌళి చేసిన అఖిల్ పాత్ర ఎలాంటి ఇబ్బందుల్లో అయినా ఫన్‌గా బిహేవ్ చేస్తుంది. ఎంసెట్ కోచింగ్ సెంటర్, వాళ్ల చదువులు, ప్రేమలో పడే క్షణాలు వీటిచుట్టూ ఈ కథ నడుస్తుంది. యూత్ కంటెంట్‌తో ఎక్కడా అశ్లీలత లేకుండా సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘లిటిల్ హార్ట్స్.’ అని బన్నీ వాస్ అన్నారు.
‘90s మిడిల్ క్లాస్ బయోపిక్’ఫేం మౌళి తనుజ్, ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ ఫేం శివానీ నాగరం లీడ్ రోల్స్ చేసిన ఈ యూత్‌ఫుల్ ఎంటైర్టెనర్కి సాయిమార్తాండ్ దర్శకుడు. ఆదిత్య హాసన్ నిర్మాత. బన్నీవాస్, వంశీ నందిపాటి ఈ సినిమాను ఈ నెల 5న రెండు తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. ఇంకా చెబుతూ ‘ సినిమా 90 థియేటర్లలో విడుదలైతే తప్ప ఓటీటీ వాళ్లు కన్సిడర్ చేయడంలేదు.
ట్రైలర్ నచ్చితేనే జనం సినిమా పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. తీరా సినిమా విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీకి ఇచ్చేస్తున్నాం. మనం థియేటర్ కోసం చేసిన ప్రమోషన్ ఓటీటీకి పనికొస్తుంది. ఇది చాలా బాధాకరం. చిన్న చిత్రాలకు టికెట్ రేట్స్ రూ.150 పెడితే బావుంటుంది.’ అని బన్నీవాస్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్, వైజాగ్, విజయవాడలో స్పెషల్ షోస్ ప్లాన్ చేశామని, 4న పెయిడ్ ప్రీమియర్స్ కూడా వేస్తున్నామని, దాదాపు 170 థియేటర్లలో విడుదల చేస్తున్నామని నిర్మాత, పంపిణీ దారుడు వంశీ నందిపాటి అన్నారు.