వరుణ్‌సందేశ్, మధులిక వారణాసి జంటగా నటిస్తున్న థ్రిల్లర్ చిత్రం ‘కానిస్టేబుల్’. ఆర్యన్ సుభాన్ దర్శకుడు. బలగం జగదీశ్ నిర్మాత. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్ ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. తప్పకుండా అందరి అంచనాలను ఈ సినిమా నిలబెడుతుందని హీరో వరుణ్‌సందేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కంటెంట్‌ని నమ్మి ఈ సినిమాను నిర్మించామని, ఒక వ్యక్తికి అవమానం జరిగితే, దాని ప్రభావం ఎలా ఉంటుంది? అనే అంశానికి సందేశాన్ని మిళితం చేసి ఈ సినిమా తీశామని నిర్మాత బలగం జగదీశ్ చెప్పారు. బాధ్యతల్ని గుర్తు చేస్తూ హృదయాలకు హత్తుకునే సినిమా ఇదని దర్శకుడు తెలిపారు. ఇంకా చిత్రబృందంతోపాటు, తెలంగాణ కల్చరల్ డిపార్టెంట్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నటుడు శివారెడ్డి కూడా మాట్లాడారు.