శ్రీలంక జనాభా 2.2 కోట్లు. ఇందులో సగానికి పైగా మంది పేదరికంలోనే మగ్గుతున్నారు. వీరి కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. విద్య, వైద్యం, ఆహారం, నివాస గృహాల నిర్మాణం, బ్యాంకు రుణాల మాఫీ, ఎరువుల పంపిణీ వంటి పథకాల కోసం బడ్జెట్లో పెద్దమొత్తంలో నిధులను కేటాయించింది. అయితే అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపించలేదు. పౌరుల ఆదాయం, సామాజిక పరిస్థితులను క్షుణ్ణంగా తనిఖీ చేయకుండానే పథకాలను అమలు చేయడం ప్రారంభించింది. దీంతో అనర్హులకే సింహభాగం ప్రయోజనాలు చేకూరాయి. దీనికితోడు ప్రభుత్వంలోని అవినీతి.. పథకాల అసలు లక్ష్యం తప్పుదోవ పట్టేలా చేశాయి. అంతిమంగా పేదలకు సంక్షేమ పథకాలు దక్కకపోవడమే కాకుండా, అనవసరంగా నిధులు ఖర్చయ్యాయి. ఈ విధంగా సంక్షేమ పథకాలు కూడా శ్రీలంక సంక్షోభానికి ప్రధాన కారణంగా నిలిచాయి.