అలంపూర్, మే 17: డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం వల్ల నీటి చౌర్యం జరిగి ఉమ్మడి పాలమూరు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని, వెంటనే ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమకారుల నియోజకవర్గ జేఏసీ చైర్మన్ షేక్ హుస్సేన్ వలీ డిమాండ్ చేశారు. ఈ విషయంపై జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిను కలిసి వినతిపత్రం అందజేశారు.
జేఏసీ కన్వీనర్ వెంకట్రామయ్యశెట్టి, మున్సిపల్ చైర్మన్ జయరాముడు, మాజీ ఎంపీపీ సుదర్శన్‌గౌడ్, నారాయణరెడ్డి, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.