ముంబై, జూన్ 17: వజ్రాల తయారీదారు జ్యువెల్స్ బై ప్రీతి (జేబీపీ) విస్తరణ బాట పట్టింది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌తోపాటు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పుణె, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌ల్లో స్టోర్లను ఏర్పాటు చేయబోతున్నది. ఈ ఏడాది ఆఖరుకల్లా దేశవ్యాప్తంగా 15 స్టోర్లను తెస్తామని సోమవారం కంపెనీ వ్యవస్థాపకులు ప్రీతి జైన్ తెలిపారు.