హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : నిలోఫర్ దవాఖానలోని ధర్మశాల భవనాన్ని రోగుల సహాయకులకు(అసిస్టెంట్స్) కేటాయించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఆయన ఉస్మానియా మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న 10 బోధనా దవాఖానల్లో వైద్యసేవల బలోపేతంపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. నిలోఫర్ దవాఖానలో ఓపీ, ఐపీ రోగులకు అందిస్తున్న సేవలపై చర్చించారు.