స్పైస్‌జెట్‌కు డీజీసీఏ షోకాజ్ నోటీసులు
న్యూఢిల్లీ: సురక్షితమైన, సమర్థవంతమైన, నమ్మకమైన వైమానిక సేవల్ని కల్పించడంలో స్పైస్‌జెట్ సంస్థ విఫలమైనట్లు ఏవీయేషన్ రెగ్యూలేటరీ సంస్థ డీజీసీఏ అభిప్రాయపడింది. స్పైస్‌జెట్ వరుస ఘటనలపై వివరణ ఇవ్వాలని కోరింది. విమానాల భద్రతా ప్రమాణాలు తగ్గిన అంశంపై వివరణ ఇవ్వాలని స్పైజ్జెట్కు డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గడిచిన 17 రోజుల్లో స్పైస్‌జెట్ విమానాల్లో ఆరుసార్లు సాంకేతిక లోపం తలెత్తింది. రెండు రోజుల క్రితం దుబాయ్ వెళ్తున్న విమానాన్ని కరాచీలో ల్యాండ్ చేసిన విషయం తెలిసిందే. ఫ్యూయల్ ఇండికేటర్ లోపం వల్ల ఆ విమానాన్ని దారి మళ్లించారు. ఇవాళ కూడా చైనా వెళ్లాల్సిన కార్గో విమానాన్ని స్పైస్‌జెట్ దారి మళ్లించినట్లు తెలుస్తోంది. వెదర్ రేడార్ పనిచేయకపోవడంతో ఆ విమానాన్ని కోల్‌కతాలో ల్యాండ్ చేశారు.
గత నెల 19 నుంచి స్పైస్‌జెట్ విమానాల్లో ఆరు దఫాలు సాంకేతిక లోపాలు తలెత్తాయి. జూన్ 19న పాట్నా నుంచి 185 మంది ప్రయాణికులతో బయలుదేరిన స్పైస్ జెట్ విమానాన్ని నిమిషాల్లోనే అత్యవసర ల్యాండింగ్ చేశారు. పక్షి ఢీ కొట్టడంతో ఇంజిన్ దెబ్బతిన్నది. అదే రోజు జబల్పూర్-ఢిల్లీ విమానంలో మరో సమస్య తలెత్తింది. గత నెల 24,25 తేదీల్లో రెండు వేర్వేరు విమానాల్లో ఫ్యూజ్‌లేజ్ డోర్ వార్నింగ్ తలెత్తింది. దీంతో ఆ రెండు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ నెల రెండో తేదీన జబల్పూర్-ఢిల్లీ విమానం క్యాబిన్లో పొగలు వచ్చాయి.
Passenger safety is paramount. Even the smallest error hindering safety will be thoroughly investigated & course-corrected. https://t.co/UD1dJb05wS
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) July 6, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

