న్యూఢిల్లీ: భద్రతా నియమావళిని ఉల్లంఘించిన ఎయిర్ విస్తారా సంస్థకు పది లక్షల జరిమానా విధించారు. భారత వైమానిక రెగ్యులేటరీ సంస్థ డీజీసీఏ ఆ జరిమానా విధించింది. సరైన శిక్షణ లేని పైలెట్లతో విమానం నడిపించిన కేసులో ఈ ఫైన్ వేశారు. మధ్యప్రదేశ్ ఇండోర్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులతో ఉన్న విమానాన్ని అనుభవం లేని పైలెట్ నడిపారు. ఈ ఘటనలో ఫైన్‌ను విధించారు. ఫస్ట్ ఆఫీసర్ పైలెట్‌తో ఇటీవల ఇండోర్ విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేశారు. సిములేటర్ శిక్షణ పూర్తి కాని పైలెట్లతో విమానాన్ని ల్యాండ్ చేయడం నేరమే అవుతుందని అధికారులు తెలిపారు.