అమరావతి: తిరుమల( Tirumala ) లో వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రికార్డు స్థాయి ( Record Level ) లో స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఒక్క రోజే 91,793 మంది శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ ( TTD ) అధికారులు వివరించారు. 31,221 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ .4.90 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడగా వీరికి 18 గంటల్లో సర్వదర్శనం అవుతుందని తెలిపారు 4.38 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించగా 3.31 మంది అన్నప్రసాదం స్వీకరించారని వివరించారు.